ETV Bharat / state

ఆదర్శం... వారి ప్రేమకు తలొగ్గిన వైకల్యం! - Ideally a standing love birds

వైకల్యం ప్రేమకు అడ్డం కాదంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజిగిరికి చెందిన వినయ్, శాంతాబాయి. కులాలు వేరైనా మనసులు కలవడం వల్ల ఇద్దరూ పెద్దలను ఒప్పంచి నాలుగేళ్ల క్రితం ఒక్కటయ్యారు. తమలాంటి వారికి సేవ చేస్తూ... అండగా నిలుస్తున్నారు.

వైకల్యం ప్రేమకు అడ్డం కాదంటూ... ఆదర్శంగా నిలుస్తోన్న జంట

author img

By

Published : Feb 14, 2021, 2:02 PM IST

వినయ్‌, శాంతాబాయి... ఇద్దరూ చిన్నతనం నుంచే పోలియో బాధితులు. అయినా కష్టపడి తమ ఉపాధి తాము వెతుక్కున్నారు. శాంతాబాయి మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్యాలయంలో దివ్యాంగులకు సహాయం చేసే గ్రూప్‌లో పనిచేస్తున్నారు. అక్కడే టెలిఫోన్‌ బూత్‌ నిర్వహించే వినయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనసులు కలవడం వల్ల ఇద్దరూ పెద్దలను ఒప్పంచి నాలుగేళ్ల క్రితం ఒక్కటయ్యారు.

ఆ తర్వాత ఇద్దరి తరఫున తోబుట్టువుల బాధ్యతలు వీరే తీసుకుని వివాహాలు జరిపించారు. తమలాంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో వినయ్‌.. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్యాలయంలో వినతిపత్రాలు రాసివ్వడం, అప్లిక్లేషన్లు పూర్తి చేసి ఇవ్వడం వంటిసేవలు అందిస్తున్నారు. వైకల్యం ప్రేమకు అడ్డం కాదంటూ.. ఆదర్శంగా నిలుస్తోందీ జంట.

ఇదీ చూడండి: 'వాలెంటైన్స్​ డే'... ఫ్రమ్ హోమ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.