Dundigal Atm Case: మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్‌లో ఏటీఎం నగదు వ్యాన్‌తో ఉడాయించిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు పట్టణాలు తిరిగిన అనంతరం జేబీఎస్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 19న వ్రైటర్ సేఫ్ గార్డ్ సంస్థ సిబ్బంది ఏటీఏంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సింధి సాగర్ రూ.36 లక్షల నగదు ఉన్న వ్యాన్‌తో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.
వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకున్నాడని... అక్కడ ఖరీదైన చరవాణి కొన్నాడని పోలీసులు వెల్లడించారు. ఓ బంగారు గొలుసును కొనుగోలు చేశాడని వివరించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని రూ.8 లక్షల 60 వేలతో కారును కొనుగోలు చేయగా... దానిని వారికే తిరిగి ఇచ్చేసి పోలీసులు నగదును తీసుకున్నారు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టి.. పక్కా సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.29.85 లక్షల నగదు, ఫోన్, బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:Jeedimetla minor girl death case : ఆ బాలికది హత్యా, ఆత్మహత్యా.. ఆ మూడు గంటలు ఏమైంది?