ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ... ఆదుకున్న వారికి అండగా...

వారు మనకెందుకులే అనుకోలేదు... అమ్మో! మనకొస్తుందేమో అని భయపడనూ లేదు... ప్రళయంలా ముంచుకొచ్చిన మహమ్మారిని తరిమి కొట్టే యజ్ఞంలో మేము సైతం అన్నారు. అలాగని వారేమీ కోట్లకు పడగలెత్తినవారు కాదు. కనీసం పది మందికి పెట్టే తాహతూ లేదు. కానీ అంతరాంతరాలలో గూడుకట్టుకున్న మానవత్వం వారిని కదిలించింది. పదిమందినీ కదిలించేలా చేసింది. ఆ మాతృమూర్తుల స్ఫూర్తిదాయక గాథలివీ...

HELPING TO NEEDY IN LOCK DOWN TIME
లాక్​డౌన్​ వేళ... ఆదుకున్న వారికి అండగా...
author img

By

Published : Apr 15, 2020, 12:23 PM IST

కులాంతర వివాహం చేసుకున్నారని కన్నవారు కాదనుకున్నారు. కానీ తోటివారు ఆ దంపతులను చేరదీశారు. నవ దంపతులకు అండగా నిలిచారు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయాయి. చాలా మంది తోటివారు చేసిన సాయాన్ని తొందరగా మర్చిపోతారు. కానీ ఆ భార్యాభర్తలలా చేయలేదు. లాక్‌డౌన్‌ వేళ.. మేమున్నామంటూ ముందుకొచ్చారు. అన్నార్తుల ఆకలి తీరుస్తూ సమాజం రుణం తీర్చుకుంటున్నారు హైమారెడ్డి, అంబటి రమేశ్‌ దంపతులు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా హకీంపేట గ్రామంలో నివాసముంటున్నారు హైమారెడ్డి, రమేశ్‌ దంపతులు. అదే ప్రాంతంలో ఫ్యాన్సీ స్టోర్స్‌, కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తున్నారు. ‘మహిళా శక్తి మై వాయిస్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహణలో హైమారెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌ శిక్షణ, నిరుపేద గృహిణులకు కుట్టు, చేతి వృత్తుల శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు.

అన్నార్తులకు అండగా..

కరోనా వైరస్‌తో దేశమంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మేమున్నామంటూ మరోసారి ముందుకొచ్చారు హైమారెడ్ఢి భర్త సహకారంతో ఇంటినే వంటశాలగా మార్చేశారామె. కూలీనాలీ చేసుకునే నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. హకీంపేట, సింగాయిపల్లి గ్రామాల్లో తమ సంఘం సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహిస్తున్నారు. సింగాయిపల్లి, హకీంపేట, తూంకుంట, బొల్లారం, రిసాలాబజార్‌ ప్రాంతాలకు తన సేవలను విస్తరించారు. వండుకునే అవకాశం ఉన్నవారికి బియ్యం, కూరగాయలు, పప్పులు, పచ్చళ్లు అందిస్తున్నారు. లేని వాళ్లకు భోజనం పెడుతున్నారు. ‘ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు లేక ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. మా శక్తి ఉన్నంత వరకూ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తామని’ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు హైమారెడ్ఢి

ఊరంతా అన్నపూర్ణలయ్యారు...

సాయం చేయడానికి మంచి మనసు ఉండాలికానీ... కోట్లు ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఆ పెద్దావిడ. ఆమె స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా తుర్కపల్లి గ్రామానికి చెందిన మహిళలంతా...

వసరం ఉన్న లేకపోయినా షాపింగ్‌మాల్స్‌లో పడి ఆహార పదార్థాలు ఖాళీ చేసేవాళ్లని చూశాం. వెనక ఉన్న వాళ్లకి లేకుండా వస్తువులు కొనేవాళ్లని చూశాం. గుర్రాల అనురాధ ఇందుకు భిన్నంగా ఆలోచించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో.. ప్రభుత్వం ఉచితంగా తన కుటుంబానికి ఇచ్చిన 60 కిలోల బియ్యం నుంచి 30 కిలోలను పేదలకు పంచిమ్మంటూ అధికారులకే తిరిగిచ్చింది. ఆమె మాటలు అక్కడున్న మహిళల్లో స్ఫూర్తిని నింపాయి. వారంతా అదే పని చేశారు. నిజానికి అనురాధతో సహా వాళ్లంతా లక్షాధికారులేం కాదు. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించేే పేద ప్రజలు. అనురాధ కొడుకు జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అక్కడి ప్రజలు తనకు అన్నం పెడుతున్నారని తల్లికి సమాచారం అందించాడు. దీంతో అనురాధ తన కొడుక్కి అక్కడి తల్లులు అన్నం పెడుతున్నారని, తన బిడ్డలాంటి వాళ్లు ఇక్కడ పనులు లేక విలవిలలాడుతున్నారని గుర్తించి తనకు వచ్చిన బియ్యంలో సగ భాగాన్ని అధికారులకు అందించి దానిని పేదలకు పంచాలని చెప్పి తనలోని తల్లి ప్రేమను చాటుకుంది. అనురాధను అనుసరించిన ఎందరో తల్లులు తమకు వచ్చిన బియ్యాన్ని అధికారులకు అందించారు. ఇలా తుర్కపల్లి అన్నపూర్ణల నిలయమైంది.

ముఖ్యమంత్రికే స్ఫూర్తినిచ్చింది

జీవితపు మలి సంధ్యలో.. ఎవరైనా ఆ సమయంలో తలెత్తే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి పెన్షన్‌ సొమ్మును జాగ్రత్తగా పదిలం చేసుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని విధిషా నగరానికి చెందిన 82 ఏళ్ల సల్భా ఉస్కార్‌ మాత్రం తన వయసును, ఆరోగ్య అవసరాలను పక్కన పెట్టారు. కరోనా కాలంలో ఇతరులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తాను దాచుకున్న డబ్బులో లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ‘ఈ పరిస్థితుల్లో సాయపడకుండా ఉండలేకపోతున్నా. ప్రజలకు కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... లాక్‌డౌన్‌ను గౌరవించి ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. ఇది మనకే మంచిది’ అంటూ వీడియో సందేశాన్ని పంపించారు. ఆమె వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌.. ‘మా తుఝే సలామ్‌. మీ ఆశీస్సులు కరోనాకు వ్యతిరేకంగా పోరాడాలనే నా నమ్మకాన్ని రెట్టింపు చేశాయ’ంటూ ఆమె త్యాగాన్ని ఎంతగానో ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.