మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలోని హర్ష యూత్ సభ్యులు నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. తమ వంతు సాయంగా సుమారు 200 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ముందుగా టోకెన్లు ఇచ్చి వారికి విధించిన సమయంలోనే రావాలని తెలియజేశారు. ఆయా సమయాల్లో వచ్చి సరుకులు తీసుకున్నారు.
భౌతిక దూరం పాటించేందుకే టోకెన్ పద్ధతి పెట్టామని యూత్ సభ్యులు పేర్కొన్నారు. మాస్కులు లేకుండా వచ్చిన వారికి మాస్కులు కూడా అందజేశారు. కష్టకాలంలో పని లేక... తినడానికి తిండి లేక ఉన్న తమను ఆదుకున్న యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?