ETV Bharat / state

హ్యాండ్​ బాల్​ పోటీలు ప్రారంభించిన మంత్రి

మేడ్చల్ జిల్లా దుండిగల్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో హ్యాండ్​ బాల్​ పోటీలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ ఒక్కటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

హ్యాండ్​ బాల్
author img

By

Published : May 26, 2019, 11:20 AM IST

దేశంలో తెలంగాణ ఒక్కటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మొదటి ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-15 బాయ్స్ హ్యాండ్​ బాల్ ఛాంపియన్ షిప్-2019 క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం 2% రిజర్వేషన్ కల్పించామన్నారు మంత్రి శ్రీనివాస్​ గౌడ్. హ్యాండ్ బాల్ భారతదేశంలో అధిక ప్రాచుర్యం పొందుతుందని జాతీయ హ్యాండ్​ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రమేష్ బ్రని అన్నారు. క్రీడాకారులకు సరైన శిక్షణ ఉంటే జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ పోటీలు నేటి నుంచి 29వ వరకు జరుగనున్నాయి. క్వార్టర్, సెమీఫైనల్స్, ఫైనల్స్​లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తామని తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. పోటీల్లో 13 రాష్ట్రాల నుంచి 45 జట్లు పాల్గొన్నాయి.

హ్యాండ్​ బాల్​ పోటీలు ప్రారంభించిన మంత్రి
ఇవీ చూడండి: ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు

Intro:Hyd_tg_55_25_handball opening ceremony_avb_c29
మేడ్చల్ : దుండిగల్
మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో అండ్ బాల్ క్రీడలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్..

Body:వచ్చే ఏషియన్ గేమ్స్ క్రీడలలో భారతదేశం తరఫున హ్యాండ్ బాల్ క్రీడలో మెడల్ సాధించడమే తమ లక్ష్యం అని, ఆ దిశగా తగు వ్యూహంతో క్షేత్ర స్థాయి నుండి క్రీడాకారులను తయారు చేస్తున్నామని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రమేష్ బ్రని అన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఉన్న గ్రౌండ్లో తెలంగాణ అండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "మొదటి ఆల్ ఇండియా ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-15 బాయ్స్ హ్యాండ్బల్ ఛాంపియన్ షిప్-2019" క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ బ్రాని మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన శిక్షణ ఉంటే జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఉంటుందని, హ్యాండ్ బాల్ క్రీడకు ఇక ముందు మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. దేశంలో ఇలాంటి హ్యాండ్బాల్ క్రీడా పోటీలు పెట్టడం ప్రధమo అని, అలాగే చక్కని వేదిక కానీ తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ కు తన సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఈ పోటీలలో పాల్గొంటున్న ప్రతిభావంతులైన వందమంది క్రీడాకారులు క్రీడాకారులను గుర్తించి వారికి తగు శిక్షణ ఇచ్చి వచ్చే ఏషియన్ గేమ్స్ క్రీడల్లో మెడల్ సాధించే విధంగా తాము ప్రయత్నం చేస్తున్నామని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని, తమకు తగిన ప్రోత్సాహం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీలు నేటి నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని లీగ్, క్వార్టర్, సెమీఫైనల్స్, ఫైనల్స్ లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తామని తెలిపారు. ఈ క్రీడలకు 13 రాష్ట్రాల నుండి 45 జట్లు పాల్గొన్నాయి అని తెలిపారు.

అనంతరం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటే క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్రం క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం 2% రిజర్వేషన్ కల్పిస్తుందని, హ్యాండ్ బాల్ క్రీడలు భారతదేశంలో అధిక ప్రాధాన్యత పొందుతుందని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ప్రచారం ఉంటుందని, మునుముందు ఇతర క్రీడల శాఖ వారు కూడా ఇలాంటి పోటీలు పెట్టి క్షేత్ర స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయాలని అన్నారు.

Conclusion:బైట్ : Dr.M. రామ సుబ్రమణి, జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ( ఇంగ్లీష్ లో మాట్లాడారు)
బైట్ : జగన్ మోహన్ రావు, తెలంగాణ హ్యాండ్బాల్ అధ్యక్షుడు
బైట్ : శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రీడా శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.