కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను ఆదుకునేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ పాండు యాదవ్ ముందుకు వచ్చారు. రోడ్డుమీద నివసిస్తున్న నిరుపేద ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు.
రామన్నకుంట చెరువు వద్ద డ్రోన్ ద్వారా కెమికల్ స్ప్రే చేయించి దోమలు, వైరస్ నివారణకు తనవంతు కృషి చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!