మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకమయి నగర్ కాలనీలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన తండ్రి కాలయముడై ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. స్థానికంగా నివాసముండే రాజేష్ వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. మద్యానికి బానిసై కూతురిపై గత కొంతకాలంగా అకృత్యానికి పాల్పడుతున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చూడండి : నడిరోడ్డుపై దారుణ హత్య.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు