మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్‌నగర్ నాలా సమస్యలపై ట్విట్టర్, టెలిఫోన్లో ఫిర్యాదులు రావటంతో జీహెచ్ఎంసీ మేయర్(Mayor) గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. గణేష్‌నగర్‌లో పాదయాత్ర చేసి వర్షపు నీటి నాలాను పరిశీలించిన అనంతరం వర్షాకాలంలో వరద సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వరద నీరు పొంగి పొర్లకుండా సాఫీగా వెళ్లేందుకు నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, వెడల్పు పనులకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో భారీ వరదలు సంభవించినప్పుడు ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, నాలాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని తెలిపారు.
ఇదీ చదవండి: శశికళ 'టేపుల' కలకలం- అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?