మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పటేల్ నగర్లో అధికారుల ఆదేశాల మేరకు నాలాలపై కట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పేద ప్రజలను ఒప్పించి నాలాలపై కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే సాయంతో పాటు తన ఆస్తులను అమ్మి రూ.20 కోట్లను పేద ప్రజలకు అందజేస్తానని ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. ప్రజలందరూ సహకరిస్తే తాను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో అక్రమ కట్టడాల కూల్చివేత