మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావుతో పాటు వివిధపార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ పార్కులోని మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
బాపు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. గాంధీజీ మార్గాలను అనుసరించి... మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావాలని నాయకులు కోరారు.