అటవీ భూములు చదును చేస్తుండగా అడ్డుకుని... నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సిబ్బందిని నిర్భందించిన ఘటన మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో జరిగింది. గాజులరామారంలోని అటవీ భూమి పక్కనే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం సోదరుడు... జై కుమార్ గౌడ్‌కు భూమి ఉంది. ఆయన మంగళవారం ప్రొక్లెయినర్‌తో అటవీ భూములు చదును చేస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఒకరిపై ఒకరు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై నోటీసులు ఇవ్వడానికి షాపూర్‌నగర్‌లోని జై కుమార్ గౌడ్ ఇంటికి అటవీశాఖ అధికారులు వెళ్లగా... ఆయన భద్రతా సిబ్బంది వారిని కొద్దిసేపు నిర్బంధించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడి వారిని పంపినట్లు దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీదేవి పేర్కొన్నారు.