జీడిమెట్లలోని హెచ్‌ఏఎల్ కాలనీలో గొడవ జరుగుతుందని సోమవారం తెల్లవారుజామున 2 గంటల 6 నిమిషాలకు డయల్ 100కి టి.శివకృష్ణ అనే యువకుడు ఫోన్ చేశాడు. కొద్ది సమయం తరువాత పోలీసులు ఫోన్ చేసి వస్తున్నామని చెప్పారు. కొంత సమయం తర్వాత యువకుడు మరోసారి పోలీసులకు ఫోన్ చేసి గొడవ సద్దుమణుగిందని అవసరం లేదని సమాచారం అందించాడు.
కానీ మరో 10 నిమిషాల తరువాత గొడవ పెరగడం వల్ల మళ్లీ పోలీసులకు ఫోన్ చేశాడు. 20 నిమిషాల తరువాత వచ్చిన పోలీసులను చూసిన అల్లరిమూకలు పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఫోన్ చేసిన యువకుడిని ఇంట్లో నుంచి పిలిచి జీడిమెట్ల హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు దురుసుగా ప్రవర్తించారు. కొట్టి జీపులో జీడిమెట్ల పీఎస్‌కు తీసుకెళ్లారు.
యువకుడు కనిపించకపోవడం వల్ల ఆందోళనతో కుటుంబ సభ్యులు వెతికి ఫోన్ చేశారు. యువకుడి ఫోన్ మాట్లాడనీయకుండా కోటేశ్వరరావు లాక్కున్నారు. స్టేషన్‌కి వెళ్లాక మీడియా సంస్థలో ఉద్యోగి అని తెలుసుకున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు తిరిగి ఇంటి వద్ద దిగబెట్టారు. దీనిపై బాధితుడు డీజీపీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : మిర్చి రైతులకు ఓ వైపు ఆనందం.. మరోవైపు ఆవేదన..