ETV Bharat / state

జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువులో 2.89 లక్షల చేపపిల్లల విడుదల - ఫాక్స్​సాగర్​ చెరువులో చేపపిల్లల విడుదల

కులవృత్తులను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిందని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వికేకానంద తెలిపారు. మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల ఫాక్స్​సాగర్ చెరువులో 100 శాతం సబ్సిడీపై 2.89 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.

fish seed released in jeedimetla faks sagar pond in medchal district
జీడిమెట్ల ఫాక్స్​సాగర్​ చెరువులో 2.89 లక్షల చేపపిల్లల విడుదల
author img

By

Published : Oct 3, 2020, 5:44 PM IST

మత్స్యకారుల సంక్షేమాభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఫాక్స్​సాగర్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై 2.89 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు.

కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీపై అనేక పథకాలను అమలు చేస్తున్నారని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు ఇలా అనేక సామాగ్రిని అందజేశారని పేర్కొన్నారు. చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం అని, రాబోయే రోజుల్లో ఈ చేపపిల్లలు పెరిగి మత్స్యకారులకు ఎంతో ఉపాధిని కలిగిస్తాయని వెల్లడించారు.

ఇదీ చూడండి: భవిష్యత్తులో హైస్కూల్‌ స్థాయిలోనే ఒకేషనల్ కోర్సులు: కిషన్​రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.