కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సూరారం భీమా గార్డెన్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమాని, కుత్బుల్లాపూర్ తెరాస యువ నాయకుడు సంతోష్ రెడ్డి మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా 1600 మందికి నిత్యావసరాలు పంచారు. అనంతరం 48 కేజీల కేకు కట్ చేశారు. మంత్రి 48వ పుట్టినరోజు సందర్భంగా 48 క్వింటాళ్ల బియ్యం, 48 క్వింటాళ్ల కూరగాయలు, 48 క్వింటాళ్ల పండ్లను పేదలకు పంచి పెట్టారు.
ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..