సీనియర్ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. గత 15 రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు.
రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు వెల్లడించారు. 1967లో మొదలైన దీక్షితులు ప్రస్థానం 2017 వరకు నిర్విరామంగా కొనసాగింది. 2015 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జర్నలిజంలో సుధీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలం సైనిక్‌పురిలో దీక్షితులు కుటుంబం నివాసం ఉంటోంది.
ఇవీ చూడండి : ఈసీ నోటీసులకు వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్