ETV Bharat / state

'ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్​ రికగ్నిషన్' - facial recognition of voters at kompally

కొంపల్లి పురపాలిక సంస్థలోని పది పోలింగ్ కేంద్రాల్లో ఫేషియల్​ రికగ్నిషన్​ ద్వారా ఓటర్​ గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇది అదనపు సౌకర్యంగానే వినియోగిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.

'కొంపల్లి పుర ఎన్నికల్లో ఫేషియల్​ రికగ్నిషన్​'
'కొంపల్లి పుర ఎన్నికల్లో ఫేషియల్​ రికగ్నిషన్​'
author img

By

Published : Jan 18, 2020, 10:48 PM IST

పింఛనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేషియర్ రికగ్నిషన్ పరిజ్ఞానం ద్వారా ఓటర్ల గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కొంపల్లి పురపాలక సంస్థలోని పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొంపల్లిలోని 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 పోలింగ్ కేంద్రాలను ఇందుకు ఎంపిక చేశారు.

టీఎస్​టీఎస్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి రాగానే మొబైల్ లోని యాప్ సాయంతో గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలోని ఫొటోలను అప్పటికే యాప్​తో అనుసంధానిస్తారు. ఓటరు ఫొటోను, జాబితాలోని ఫొటోను యాప్ పరిశీలిస్తుంది. ఫొటో సరిపోతే గుర్తించినట్లు సందేశాన్ని ఇస్తుంది.

ముఖాన్ని గుర్తించకపోతే...?

యాప్ గుర్తించకపోయినప్పటికీ సదరు ఓటరును ఓటింగ్​కు అనుమతించకుండా ఉండేందుకు వీల్లేదు. మామూలు విధానంలో గుర్తింపు పత్రం, పోలింగ్ ఏజెంట్ల నుంచి సమాచారం తీసుకొని సదరు ఓటరును ఓటింగ్​కు అనుమతించవచ్చు. ఓటరు గుర్తింపు కోసం ఈ పరిజ్ఞానాన్ని కేవలం అదనపు సౌకర్యంగానే వినియోగిస్తున్నట్లు, ఓటర్ల ఫొటోలను యాప్ నుంచి తొలగిస్తామని... ఎక్కడా ఉపయోగించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

పది పోలింగ్ కేంద్రాల కోసం 4జీ సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లను సమకూర్చాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ను ఎస్ఈసీ ఆదేశించింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానం ఉపయోగానికి సంబంధించి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పోలింగ్ సిబ్బంది, సంబంధిత వ్యక్తులకు పోలింగ్​కు ముందు రోజు అవగాహన కల్పించనున్నారు.

facial recognition of voters at kompally
ఓటర్లు గుర్తించే ప్రక్రియ

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

File : TG_Hyd_81_18_Facial_Recognisation_AV_3053262 From : Raghu Vardhan Note : Photo through Whatsapp ( ) ఫించనుదారుల కోసం వినియోగిస్తున్న ఫేసియర్ రికగ్నైజేషన్ పరిజ్ఞానం ద్వారా ఓటర్ల గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. మేడ్చెల్ - మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లి పురపాలక సంస్థలోని పది పోలింగ్ కేంద్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొంపల్లిలోని 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 పోలింగ్ కేంద్రాలను ఇందుకు ఎంపిక చేశారు. టీఎస్టీఎస్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా ఓటర్లను గుర్తిస్తారు. ఓటరు పోలింగ్ కేంద్రంలోకి రాగానే మొబైల్ లోని యాప్ సాయంతో గుర్తింపు ప్రక్రియ చేపడతారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలోని ఫోటోలను అప్పటికే యాప్ నకు అనుసంధానిస్తారు. ఓటరు ఫోటోను, జాబితాలోని ఫోటోను యాప్ పరిశీలిస్తుంది. ఫోటో సరిపోతే గుర్తించినట్లు సందేశాన్ని ఇస్తుంది. యాప్ గుర్తించకపోయినప్పటికీ సదరు ఓటరును ఓటింగ్ కు అనుమతించకుండా ఉండేందుకు వీల్లేదు. మామూలు విధానంలో గుర్తింపు పత్రం, పోలింగ్ ఏజెంట్ల నుంచి సమాచారం తీసుకొని సదరు ఓటరును ఓటింగ్ కు అనుమతించవచ్చు. ఓటరు గుర్తింపు కోసం ఈ పరిజ్ఞానాన్ని కేవలం అదనపు సౌకర్యంగానే వినియోగిస్తున్నట్లు, ఓటర్ల ఫోటోలను యాప్ నుంచి తొలగిస్తామని... ఎక్కడా ఉపయోగించబోరని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. యాప్ ద్వారా ఓటరు గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్న పది పోలింగ్ కేంద్రాల్లో అదనంగా మరో పోలింగ్ అధికారిని విధుల్లో నియమిస్తారు. ఎన్నికల సాధారణ పరిశీలకుని సమక్షంలో అదనపు పోలింగ్ అధికారులను ఎంపిక చేస్తారు. పది పోలింగ్ కేంద్రాల కోసం ఫోర్ జీ సదుపాయం కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లను సమకూర్చాలని మేడ్చెల్ - మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ను ఎస్ఈసీ ఆదేశించింది. ఫేసియల్ రికగ్నైజేషన్ విధానం ఉపయోగానికి సంబంధించి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, పోలింగ్ సిబ్బంది, సంబంధిత వ్యక్తులకు పోలింగ్ కు ముందు రోజు అవగాహన కల్పించనున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.