ETV Bharat / state

పరిశ్రమలో పేలుడు.. ఎగిరిపడిన శకలాలు - jeedimetla blast

భారీ పేలుడుతో జీడిమెట్ల ప్రాంత్రం ఉలిక్కిపడింది. జీవికా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో పేలుడు ధాటికి షెడ్డు శకలాలు అర కిలోమీటరు దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు.

పరిశ్రమలో పేలుడు.. ఎగిరిపడిన శకలాలు
author img

By

Published : Nov 19, 2019, 6:03 AM IST

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జీవికా లైఫ్ సైన్సెన్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి 500 మీటర్ల వరకూ కంపెనీ శకలాలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, పక్క కంపెనీల వాళ్లు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఆరుగురు కార్మికులు విధుల్లో ఉన్నట్లు కంపెనీ ఉద్యోగులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి.

ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న అన్వర్​ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం అన్వర్​ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబరీష్ అనే మరో అమ్రిష్​ దాసు అనే కార్మికుడు శిథిలాల మధ్య చిక్కుకుని మరణించగా.. గాయపడిన మరో ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరు కార్మికులు బిహార్​కి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ పేలుడు ధాటికి సమీపంలోని కలోరమా ప్రింటింగ్​ ప్రెస్ ​(ఈనాడు)తో పాటు మరో రెండు పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కలోరమా ప్రింటింగ్​ ప్రెస్​లో దాదాపు 10 చోట్ల గోడలు బోటలు వారాయి.

జీవికా రసాయన పరిశ్రమకి సరైన అనుమతులు లేవని, ఎన్ని సార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టు పక్కల ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయని.. ఇంకో ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పరిశ్రమలో పేలుడు.. ఎగిరిపడిన శకలాలు

ఇదీ చూడండి : 'చట్టవిరుద్ధమా కాదా అని తేల్చేది కార్మిక న్యాయస్థానమే'

TG_HYD_06_19_JEEDIMETLA_BLAST_pkg_3182400_TS10011 రిపోర్టర్ నాగార్జున కెమెరా అశోక్ ( ) జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలోని జీవిక లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దర కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సోమవారం రియాక్టర్ పేలిన సమయంలో ఆరుగురు కార్మికుల విధుల్లో ఉన్నట్లు కంపనీ ఉద్యోగులు తెలిపారు. తమకి న్యాయం చేయాలంటూ కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగారు. మరోవైపు పేలుడ ధాటికి స్థానికులు భయాధోళనకు గురయ్యారు. వాయిస్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. జీవకా లైఫ్ సైన్సెన్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికు మృతి చెందారు. పేలుడు ధాటికి ఆ కంపనీ తో పాటు పక్కన ఉన్న పలు కంపనీలు దెబ్బతిన్నాయి....500 మీటర్ల వరకూ కంపనీ శకలాలు ఎగసి పడ్డాయి...స్థానికులు ప్రక్కన కంపనీల వాళ్ళు కూడా భయంతో పరుగుతీశారు. జీవికా కంపనీలోని కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థాలానకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోప చిక్కుకున్న అన్వర్ అనే వ్యక్తిని బయటకు తీసి ఆస్పత్రికిక తరలించారు.చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మరో కార్మికుడు లోపల ఉన్నాడన్న సయాచారంతో రసాయన వాసనతో ఊపిరి ఆడకపోవడంతో మాస్కులు ధరించి లోపలికి వెళ్ళారు. శిధిలాల మధ్య అంబరీష్ అనే వ్యక్తి చిక్కుకుని మృతి చెందిన అతన్ని బయటికు తీశారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన ఇద్దరు బీహార్ కి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. బైట్: సుభాష్ రెడ్డి, జీడిమెట్ల ఫైర్ అధికారి బైట్ : రమణా రెడ్డ,జీడిమెట్ల ఇన్పెక్టర్ వాయిస్ జీవికా రసాయన పరిశ్రమకి సరైన అనుమతులు లేవని ఎన్న సార్లు కాలుష్య నియంత్రణా మండలికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టు ప్రక్కల ఇలాంటి కంపనీలు చాలా ఉన్నాయని మరింత మంది చనపోకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బైట్: స్థానికుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.