మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రామాంతాపూర్, నెహ్రూనగర్‌లో మాజీ కౌన్సిలర్ గువ్వల జలంధర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిలో నిరంతరం శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. కరోనా నివారణ కోసం ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జలంధర్ విజ్ఞప్తి చేశారు.
