ETV Bharat / state

'మీ పిల్లలు సోషల్ మీడియా బారిన పడ్డారా...?' - students addicted to social media

విద్యార్థులు సోషల్ మీడియా, సెల్​ఫోన్ బారిన పడకుండా మార్గనిర్దేశం కోసం డిసెంబర్ 1న మేడ్చల్​ జిల్లా బాచుపల్లిలో సదస్సు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వీఆర్​ఎస్ & వీజే రెసిడెన్షియల్ స్కూల్ డైరెక్టర్ విజయరాణి కోరారు.

తల్లిదండ్రులు, పిల్లలు సదస్సుకు హాజరుకండి : పాఠశాల సంచాలకురాలు

author img

By

Published : Nov 26, 2019, 7:17 AM IST

మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని వీఎన్​ఆర్ & వీజే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి డిసెంబర్ 1న ప్రత్యేక సదస్సు చేపట్టనున్నారు. యాన్ ఎన్​రిచ్​మెంట్ ప్రోగ్రామ్ ఫర్ పేరెంట్స్ & స్టూడెంట్స్' సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల సంచాలకులు అన్నారు. సదస్సుకు తల్లిదండ్రులు, పిల్లలు హాజరవ్వాలని ఆమె కోరారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలను ఎలా గైడ్ చేయాలి, సోషల్ మీడియా, ఫోన్, ట్యాబ్​ల బారిన పడకుండా పిల్లలను ఎలా దారిలో పెట్టాలనే విషయంపై సదస్సులో తెలుసుకోవచ్చని అన్నారు.

మేమున్నాం...కౌన్సిలింగ్ ఇస్తాం

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య గ్యాప్ ఎక్కువ‌ రావడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. తద్వారా తల్లిదండ్రులకు పిల్లలపై వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు ఉంటాయని, ఆన్‌లైన్​లో ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

తల్లిదండ్రులు, పిల్లలు సదస్సుకు హాజరుకండి : పాఠశాల సంచాలకురాలు

ఇవీ చూడండి : సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.