'పేరు గొప్ప - ఊరు దిబ్బ' అన్నట్లు.. రెడ్డిల్లోనూ పేదలున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ పేర్కొన్నారు. కేంద్రం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినా, రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. చాలామంది పేద విద్యార్థులు నష్టపోతున్నారని గుర్తు చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేధిక ఆధ్వర్యంలో జరిగిన 'రెడ్ల రణభేరి' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
రాష్ట్రంలో.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డి.కె.అరుణ డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం.. రూ. 5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్, రెడ్డి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంతోశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి, తదితర రెడ్డి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'తెలంగాణలో మహిళకు మంత్రి దక్కడానికి ఐదేళ్లు పట్టింది'