ETV Bharat / state

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ - updated news on District wide janatha curfew in medchal malkajigiri district

కరోనా మహమ్మారిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రజలంతా సహకరిస్తున్నారు. తమ తమ ఇళ్లకే పరిమితమవుతూ.. కరోనా కట్టడిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

District wide janatha curfew in medchal malkajigiri district
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
author img

By

Published : Mar 22, 2020, 12:08 PM IST

కరోనాను నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా తమ వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసి వేసి.. ఇళ్లలోనే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులూ మూతబడ్డాయి.

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, ఉప్పల్, ఘట్​కేసర్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్​లోని రోడ్లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి.

కూకట్​పల్లిలో..

కూకట్​పల్లిలోనూ జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇళ్లలోనే గడుపుతున్నారు. కూకట్​పల్లిలోని జేఎన్టీయూహెచ్ సర్కిల్, మూసాపేట్, హైటెక్ సిటీ రహదారి తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

మల్కాజిగిరిలోనూ..

మల్కాజిగిరి, కుషాయిగూడ, కీసరలోనూ జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే కుషాయిగూడ బ​స్టాండ్, కూరగాయల మార్కెట్లు బోసిపోయాయి. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

జీడిమెట్లలో..

కరోనాను నివారించేందుకు జీడిమెట్లలో ప్రజలంతా తమ తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. వైరస్​ను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి మాత్రం 5 బస్సులను అందుబాటులో ఉంచారు.

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ

ఇదీ చూడండి:గుడ్లు, చికెన్‌తో కరోనా వ్యాపించదు..అవన్నీ అపోహాలే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.