ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​ ఎస్​ఎఫ్​సీకి చెందిన కబ్జా స్థలాలు కూల్చివేత - మేడ్చల్​ జిల్లా

మేడ్చల్​ జిల్లా గాజులరామారాంలోని ఏపీఎస్​ఎఫ్​సీకి చెందిన కబ్జాకు గురైన స్థలంలో మంగళవారం రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులు, కుత్బుల్లాపూర్‌ రెవెన్యూ అధికారుల సహయంతో అధికారులు కూల్చివేతలు జరిపారు. సర్వే నెంబర్​ 307, 308లలో దాదాపు 273 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఉమ్మడి స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ సంస్థకు కేటాయించారు. ఆ స్థలాల్లో కబ్జదారులు క్వారీలు వేసి ఆక్రమించారు.

ఆంధ్రప్రదేశ్​ ఎస్​ఎఫ్​సీకి చెందిన కబ్జా స్థలాలు కూల్చివేత

author img

By

Published : Mar 5, 2020, 7:42 AM IST

ఆంధ్రప్రదేశ్​ ఎస్​ఎఫ్​సీకి చెందిన కబ్జా స్థలాలు కూల్చివేత

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వేనెంబర్ 307,308లలో దాదాపు 273 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అభివృద్ధి కొసం ఉమ్మడి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు కేటాయించారు. అప్పటికే ఆ స్థలంలో చాలావరకు క్వారీలు ఆక్రమించి ఉండటం వల్ల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ సంస్థ వారు ఈ స్థలాన్ని ఎవరికి కేటాయించలేదు. అలాగే ఎలాంటి పనులు ప్రారంబించలేదు.

2015లో స్వాధీనం:

అయితె రాష్ట్ర విభజన అనంతరం 2015లో నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఎస్​ఎఫ్​సీ స్థలాలను స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్​ఎఫ్​సీ సంస్థ వెంటనే స్పందించి అందులో తమవాటాకూడా ఉంటుందన్న వాదనతో 2015లోనే తమవాటా అప్పగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఇది ఇలా ఉండగా.. స్థానిక నాయకుల అండతో కబ్జారాయిల్లు రాత్రికి రాత్రే కట్టడాలు నిర్మిస్తున్నారన్న సమాచారంతో ఎలక్ట్రానిక్ మీడియా కవరేజికి వెళ్లిన వారిపై దాడులు చేసి తీవ్రంగా గాయపరచారు. ఈ ఘటనతో పలు కేసులు నమోదయ్యాయి.

ఏపీఎస్​ఎఫ్​సీ అధికారుల్లో చలనం:

ఈ సంఘటనతో ఏపీఎస్​ఎఫ్​సీ అధికారుల్లో చలనం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి పోలీసుల సహయంతో అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. అయితే ఒక వర్గానికి చెందినవి మాత్రమే కూల్చివేశారని.. అధికార పార్టీ నాయకుడు నిర్మించిన అక్రమ నిర్మాణాలు వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడే ఎస్​ఎఫ్​సీ శాఖకు సంబంధించిన స్థలాలైన గాజులరామారం దేవేందర్ నగర్, ఎల్లమ్మబండ,ప్రగతినగర్ సరిహద్దుల్లో కబ్జాలు కాకుండా సెక్యూరిటీని 2007 నుంచే నియమించింది.

సెక్యూరిటీ గార్డు సహాయం:

ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలకు, కబ్జాలకు, కబ్జాదారులకు సెక్యూరిటీ గార్డు సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్థానిక సమాచారం. రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రభుత్వం ఎస్​ఎఫ్​సీ స్థలం స్వాధీనం చేసుకోవడంలో ఆలస్యం కావడం కబ్జాదారులకు వరంగా మారింది. శాఖాపరమైన లొసుగులను సెక్యూరిటీ గార్డు అనుక్షణం కబ్జాదారులకు చేరవేస్తు తాను బాగానే కాసులు కూడ బెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి:బడ్జెట్​కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.