భారత్ ఏ దేశంతోనూ సంఘర్షణ కోరుకోదని... శాంతి కోసమే ప్రయత్నిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. భారత రక్షణ రంగంలో వాయుసేన సేవలు స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గవని పేర్కొన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో వాయుసేన చూపిన పరాక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. జల, వాయు, భూమి యుద్ధమే కాకుండా సైబర్ యుద్ధం కూడా పొంచి ఉందని.... రాబోయే రోజుల్లో దీనికి మరింత సన్నద్ధం కావాలని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పరేడ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 114 మంది వాయుసేన అధికారులు, ఆరుగురు నేవీ, ఐదుగురు కోస్టుగార్డు క్యాడెట్లు పాల్గొన్నారు. వారి నుంచి రాజ్ నాథ్ సింగ్ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందించారు. పాసింగ్ అవుట్ పరేడ్, వాయుసేన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
- ఇదీ చూడండి : 'చరిత్రగల ఆలయాల కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతాం'