కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ ఉత్తర్వులు ప్రజలందరూ విధిగా పాటించాలని మల్కాజిగిరి డీసీపీ రక్షితాకృష్ణమూర్తి అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి.. ఘట్కేసర్లోని ఔటర్‌రింగ్‌రోడ్డు టోల్ ప్లాజా వద్ద వరంగల్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లు, క్లీనర్లకు భోజనం ప్యాకెట్లు, తాగునీరు అందజేశారు.
పోలీసు శాఖ ఎప్పుడూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి.. సహాయం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అత్యవసర సమయంలో పోలీసు శాఖ సేవలు వినియోగించుకోవాలని కోరారు. సిక్కు సేవా ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్