మేడ్చల్ జిల్లా దుండిగల్ కైసర్నగర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ రాక్షస తండ్రి. పెద్ద కుమార్తె (14)పై గత సంవత్సరం కాలంగా తండ్రి అత్యాచారానికి పాల్పడేవాడు.
నిన్న రాత్రి తన చిన్న కుమార్తె(11)పై అత్యాచారానికి పాల్పడుతుండగా... తల్లి లేచి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను భార్య నిలదీయగా భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించగా చిన్న కుమార్తె బయటకి వచ్చి చుట్టుపక్కల వారికి చెప్పగా... అందరు కలిసి ఆ దుర్మార్గుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబం ఏడాది క్రితం బిహార్ నుంచి వలస వచ్చి కైసర్నగర్లో ఉంటోంది.
ఇదీ చూడండి: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ