నెరేడ్మెట్లో సైబర్యోదా అవగాహన కార్యక్రమం జరిగింది. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, ఎడ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేటి యువత సామాజిక మాధ్యమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్ యోదా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: రైతుల దీక్షకు మద్దతుగా ట్రాక్టర్లతో కాంగ్రెస్ ర్యాలీ