మేడ్చల్ జిల్లా జవహర్నగర్ ఠాణా పరిధి బాలాజీ నగర్లోని మల్కారం సీఆర్ఫీఎఫ్ క్యాంపులో కానిస్టేబుల్ అత్మహత్య చేసుకున్నాడు. మహరాష్ట్రకు చెందిన విఠల్రావు మనువార్ సర్వీసు తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సెలవులపై వెళ్లి రెండు రోజుల క్రితం విధులకు హాజరయ్యాడు.
రాత్రి విధులకు వచ్చిన విఠల్ రావు ఆదివారం తెల్లవారుజామున తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.