మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టు వద్ద సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన ఆయన... రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న వలసకూలీలను ఆపి... వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం పలు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మామిడిపండ్లు పంచిపెట్టారు.
ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!