ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన నెమలిని పోలీసులు రక్షించారు. బాలానగర్ పరిధి ఐడీపీఎల్ రోడ్డుపై ఓ నెమలి కరెంట్ షాక్తో గాయాలపాలైంది. అటుగా వెళ్తున్న బాలానగర్ పోలీసులు గమనించి అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
అనంతరం వారికి ఆ నెమలిని అప్పగించగా వారు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. గాయపడిన నెమలిని రక్షించిన పోలీసులను సీపీ సజ్జనార్ అభినందించారు.
ఇదీ చూడండి : 'రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి'