కరోనా పరీక్షల నిమిత్తం మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన ఓ మహిళా(35) గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఆమె అనారోగ్యంతో ఉండటం వల్ల ఇంట్లో ఉండకుండా... హోటళ్లలో బస చేసినట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమె ఇటలీ నుంచి ఎప్పుడు వచ్చింది... ఎక్కడెక్కడ బసచేసిందనే వివరాలతో మేడ్చల్ జిల్లా వైద్యాధికారులకు నివేదిక పంపారు.
నివేదిక ఆధారంగా మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వేలెన్స్ టీం అధికారి, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు... వివరాల కోసం ఆమె బస చేసిన హోటల్ కి వెళ్లగా... యాజమాన్యం వివరాలు ఇవ్వలేదు. సదరు వైద్యులు పేట్ బషీరాబాద్ ఏసీపీ, కొంపల్లి మున్సిపల్ కమిషనర్లకు విషయం తెలిపారు. ఏసీపీ సూచనతో ఎస్సై ఆధ్వర్యంలో అధికారులు హోటల్కి వెళ్లి వివరాలు ఆరా తీశారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : కరోనా వ్యాప్తి, నివారణ, సంసిద్ధతపై పీఎంఓ సమీక్ష