గత అయిదు నెలలుగా కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లను కొనడాన్ని నిరసిస్తూ... కుత్బుల్లాపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ లేఖను సమర్పించారు. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేసే అంశం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని స్పష్టం చేశారు. గతంలో తెదేపాను నేడు కాంగ్రెస్ ను విలీనం చేయడం...రాబోయే రోజుల్లోఎన్నికలు ఉండవు అనేవిధంగా కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని శ్రీశైలం గౌడ్ విమర్శించారు. బెదిరించే వాడికి ఎదిరించే వాడు లేకపోతే గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యన్ని బతికించుకోడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని పేర్కొన్నారు.
విలీనాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి లేఖ - విలీనాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి లేఖ
తెరాస ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ...కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం రాజ్యంగ విరుద్ధమన్నారు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్.
![విలీనాన్ని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి లేఖ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3495866-674-3495866-1559900445603.jpg?imwidth=3840)