ETV Bharat / state

'సుమేధ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం ఇవ్వాలి' - మేడ్చల్​ వార్తలు

నేరేడ్​మెట్​లో నాలాలోపడి మృతి చెందిన బాలిక సుమేధ కుటుంబాన్ని కాంగ్రెస్​ నేతలు పరామర్శించారు. బాలికది ప్రమాదవశాత్తు మరణం కాదని... అది ప్రభుత్వ హత్యేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ఆరోపించారు. ఘటనకు సంబంధించి మంత్రి కేటీఆర్​, జీహెచ్​ఎంసీ మేయర్​, కమిషనర్​పై కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలన్నారు.

'సుమేధ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం ఇవ్వాలి'

author img

By

Published : Sep 20, 2020, 9:16 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెడ్​లో నాలాలోపడి మృతి చెందిన బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్​ నేతలు పరామర్శించారు. బాలిక సుమేధ ప్రమాదవశాత్తు మృతి చెందలేదని... అది ప్రభుత్వ హత్యేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ఆరోపించారు. అనంతరం సంఘటనా జరిగిన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే సుమేధ మృతిచెందిందని... బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలని డిమాండ్​ చేశారు.

ముందే స్పందించి ఉంటే మా బిడ్డ దక్కేది

పోలీసులు ఘటన జరిగిన రాత్రంతా వెతికారు. కానీ జీహెచ్​ఎంసీ రెస్క్యూటీం అర్ధరాత్రి వరకు గాలించి ఉంటే తమ బిడ్డ గాయాలతో అయినా బయటపడేదని సుమేధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. నాలాలపై కప్పులు వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించింది.

'సుమేధ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం ఇవ్వాలి'

ఇదీ చూడండి: సుమేధ ఘటనలో అధికారులపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.