శాసనసభ ఎన్నికల్లో బోల్తా కొట్టిన కాంగ్రెస్... గౌరవప్రదమైన పార్లమెంట్ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోరాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డిలో కాంగ్రెస్ బలంగా ఉన్న మల్కాజిగిరి, చేవెళ్లపై ఆశలు పెట్టుకుంది. అభ్యర్థులు, రాజకీయ పరిస్థితులను పరిగణించి ఓటేస్తారని చెబుతున్నారు. దాదాపు 31లక్షల ఓటర్లు ఉన్న మల్కాజిగిరిలో... మూడో వంతుకుపైగా ఉండే తటస్థ ఓటర్లే తమను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి అభ్యర్థి రేవంత్‌రెడ్డి... వాగ్ధాటి, ప్రభుత్వంపై పోరాటం, సమస్యలపై స్పందిస్తారన్న నమ్మకం... జనాల్లో బలంగా ఉందని అంచనా వేస్తున్నారు.
నగర శివారులోని చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో... సగటున మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో 4లక్షల 50వేలు, శేరిలింగంపల్లిలో 6లక్షలకు పైగా ఓటర్లున్నారు. మిగతా స్థానాల్లో 2లక్షలకు పైగా ఓట్లు ఉంటాయి. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో ఓటర్లు పార్టీలకు అతీతంగా ఓట్లేస్తారనే విశ్వాసంతో ఉన్నారు హస్తం నేతలు. ఇక్కడి ఓటర్లపై పార్టీల ప్రభావం కన్నా అభ్యర్థుల గుణగణాలనే చూస్తారని అంచనా వేస్తున్నారు. జయాపజయాలను శివారు ఓటర్లే నిర్ణయించనున్నందున ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్‌లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో మజ్లిస్‌ను ఢీకొట్టేదెవరు ?