ETV Bharat / state

కండ్లకోయలో బాల్య వివాహం

కండ్లకోయలో జూన్​ 2న బాల్య వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం వల్ల విషయం బయటకు వచ్చింది.

Child Marriage In Medchal Kandlakoya
కండ్లకోయలో బాల్య వివాహం
author img

By

Published : Jun 3, 2020, 11:12 AM IST

మేడ్చల్​ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలో నివాసం ఉండే ఓ యువకుడు కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన ఓ దంపతులు అదే ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 13 సంవత్సరాల కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రులతో కలిసి పనుల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆ యువకుడు, బాలిక ప్రేమించుకున్నారు. విషయం బాలిక ఇంట్లో తెలియడం వల్ల గొడవకు దారి తీసింది.

కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దగా వ్యవహరించిన ఓ ప్రజాప్రతినిధి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి గ్రామంలోని చెరువు కట్టపై ఉన్న అమ్మవారి ఆలయంలో మైనర్​ బాలికకు, ఆ యువకుడికి దగ్గరుండి వివాహం జరిపించాడు. ఈ విషయంపై ఐసీడీఎస్‌ సూజర్‌వైజర్‌ హైమావతిని వివరణ కోరగా బాల్య వివాహం తమ దృష్టికి రాలేదన్నారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.