వరద బాధితులను రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. అమీర్పేట డివిజన్లోని అంకం బస్తీ, సనత్నగర్ డివిజన్లోని శ్యామల కుంట బస్తీల్లో వరద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వెంటనే బాధిత కుటుంబాలకు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. వరద సమయంలో నాలాలు సరియైన పరిస్థితుల్లో లేవన్నారు. వాటిని రిపేర్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రతి ఒక్కరూ వరద బాధిత కుటుంబాలకు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఆ కారణంగానే వరదలు పెరిగాయాని కేంద్ర మంత్రి తెలిపారు. కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే హైదరాబాద్లో ఇళ్లు నీటమునిగాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్రమణల దారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి : అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్రెడ్డి