నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని... రాచకొండ పోలీసు కమిషనరేట్ మల్కాజిగిరి డీసీపీ రక్షణ మూర్తి పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఠాణా పరిధిలోని వినాయకనగర్‌లో 200మంది పోలీసు సిబ్బందితో కలిసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మేమున్నామనే భరోసా, భద్రత కల్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేరస్థుల కదలికలు, అసాంఘీక కార్యకలాపాలు అరికట్టడానికి ఇవి దోహదపడతాయని డీసీపీ అన్నారు. తనిఖీలో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 19 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోతో పాటు నిషేధ గుట్కా, చైనా గాలిపటం దారం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
- ఇవీచూడండి: విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు