మేడ్చల్ జిల్లా కీసర మండలం వన్నిగుడ వద్ద అతివేగంతో వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వన్నిగుడ గ్రామానికి చెందిన కిష్టయ్య, నర్సింలుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ మద్యం తాగి నడపటం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం