ETV Bharat / state

మలుపు వద్ద వేగం.. గుంతలో ఇరుక్కుపోయిన బొలెరో - బోయిన్​పల్లిలో గుంతలో ఇరుక్కుపోయిన బొలెరో వాహనం

సికింద్రాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్​ నుంచి ఎల్​ఐసీ భవనం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

bolero flipped at bowenpally due to high speed
మలుపు వద్ద వేగం.. గుంతలో ఇరుక్కుపోయిన బొలెరో
author img

By

Published : May 30, 2020, 7:19 PM IST

వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడిన ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బోయిన్​పల్లి మార్కెట్​ నుంచి ఎల్​ఐసీ భవనం వైపు వెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది.

ఘటనలో వాహనంలో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు బొలెరోను వేగంగా తీసుకురావటంవల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గుంతలోకి దూసుకెళ్లిన వాహనం అక్కడ ఇరుక్కుపోగా అధికారులు దాన్ని బయటకు తీసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.