వినాయక నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై భాజపా ఎమ్మెల్సీ రామచందర్రావు మండిపడ్డారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సఫిల్గూడాలోని చెరువును పరిశీలించారు. నిమజ్జనం కోసం కనీస ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు.
హిందువుల పండుగ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని... వినాయక మండపాల నిర్వాహకులపై కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: యాక్టివ్ కేసుల కన్నా 3 రెట్లు అధికంగా రికవరీలు