మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్‌లో భాజపా సభ్యత్వ నమోదు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని... సభ్యత్వ నమోదు చేయించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు.
బలోపేతం దిశగా అడుగులు
రాష్ట్రంలో భాజపా బలోపేతం దిశగా అడుగులు వేస్తోందని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి పేదవాడికి చేరాలని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కమలం పార్టీలో చేరాలన్నారు. 20 ఏళ్లక్రితం గుజరాత్లో సామాన్య కార్యకర్తగా ఉన్న వ్యక్తి... జాతీయ అధ్యక్షుడు కావడం ఒక్క భాజపాలోనే సాధ్యమని ప్రశంసించారు.
ఇదీ చూడండి : "కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి"