మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని దేవేందర్ నగర్లో రాత్రికిరాత్రే నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ విషయం మీడియా ప్రతినిధుల దృష్టికెళ్లింది. అన్యాయాన్ని ఆపుదామాని అక్కడికి వెళ్లిన వారిపై అక్రమార్కులు దాడికి దిగారు.
ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల్లో కొందరు కొంతకాలంగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాటికి ఎలాంటి అనుమతులు లేదు. దీనికితోడు రాత్రికిరాత్రే రూములు నిర్మిస్తున్నారు. విషయం తెలియడం వల్ల అక్కడికి ముగ్గురు మీడియా ప్రతినిధులు వెళ్లారు.
అక్రమ నిర్మాణాలను ప్రశ్నించినందుకు వారిపై దాడికి దిగారు. కెమెరాలు, చరవాణులు లాక్కున్నారు. వాహనాలు గుంజుకున్నారు. మీడియా ప్రతినిధులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని కెమెరాలు, ఫోన్లు, వాహనాలు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.