మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో నాలాలో తెలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం ముఖాన్ని తీవ్రంగా గాయపరిచి, చేతులను తాళ్లతో కట్టి, కొట్టి చంపినట్టుగా కనిపించింది. ఆ మహిళను ఎక్కడో చంపేసి తీసుకువచ్చి నాలాలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఖైరతాబాద్ ఉత్సవ సమితి చరిత్రలోనే కొత్త అధ్యాయం