Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల బెయిల్‌పై నిందితుల తరుపు లాయర్లు మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మేడ్చల్ సెషన్స్ కోర్టులో వాదనలు ముగిశాయి. సుమారు గంటపాటు జరిగిన వాదనల్లో నిందితులకు బెయిల్ ఇస్తే సాంకేతిక ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని... దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. నిందితులకు బెయిల్ ఇస్తే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈనెల 31న తీర్పు వెల్లడించనుంది.
భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు...
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు ఈనెల 2న సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ హత్యకు సుపారీ గ్యాంగ్‌తో కుట్రపన్నినట్లు తెలిపారు. అయితే మంత్రి హత్య కుట్రను భగ్నం చేసి.. నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్‌కు చెందిన యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు.. సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు యత్నించారు.
అయితే ఈ విషయాన్ని ఫరూక్.. పేట్‌బషీరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.నిందితుల్లో ఒకరైన నాగరాజు ఇచ్చిన సమాచారంతో.. దిల్లీలోని భాజపా నేత జితేందర్ రెడ్డి నివాసంలో రఘును అరెస్ట్ చేశారు. రఘుకు ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం ముగ్గురినీ విడిచిపెట్టారు. హత్య కుట్ర కోణాన్ని దిల్లీ పోలీసులకు సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు.
ఇదీ చూడండి:
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
మంత్రి హత్య కుట్ర వెనుక ఎవరెవరి పాత్ర ఉంది..? కుట్ర ఎలా బయటపడింది..?