పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ దివ్యాంగులకు నిత్యావసరాలు, గుడ్లు, పాలు అందించారు. ఎల్లమ్మ బండ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమంలో వందమంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంచారు.
ఈ క్రమంలో చిన్న వయసులో పోలియోకు గురై.. సాయం అందుకోవడానికి వచ్చిన బాలుడిని చూసి.. వెంకటేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ అబ్బాయికి రెండువేల రూపాయలు ఇచ్చి ధైర్యం చెప్పి పంపారు. డివిజన్లో ఉన్న పేద దివ్యాంగులకు వచ్చే పుట్టినరోజు వరకల్లా తన వంతుగా ఏ సాయమైనా చేస్తానని తెలిపారు. అనంతరం రాజేశ్వరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పాలు, నిత్యావసరాలు అందించారు.
ఇవీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు