ఐదేళ్లు డివిజన్‌ను పాలించిన అనుభవంతో రాబోయే ఐదేళ్లలో డివిజన్‌ను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ విజయ శాంతి రెడ్డి పేర్కొన్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అల్వాల్‌లోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు మరింత చేరువవుతామన్నారు. నిధులు మంజూరు అయిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు.
వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వరదనీరు వెళ్లే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పలు కాలనీలు, బస్తీల్లో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నందున.. వాటి స్థానంలో నూతనంగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. చెరువుల్లో డ్రైనేజీ నీరు కలవకుండా ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. డివిజన్లో భాజపా ప్రభావం ఉన్నప్పటికీ తెరాస ఓటింగ్ శాతం తగ్గలేదన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే మేయర్‌గా ప్రజలకు సేవలు అందిస్తామన్నారు.
ఇదీ చూడండి: 115 డివిజన్లలో తెరాస-భాజపాల మధ్య హోరాహోరీ పోరు