ETV Bharat / state

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా

విద్యార్థులు దృఢంగా ఉండేందుకు అల్పాహార పథకాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్​... గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ భాగస్వామ్యంతో మేడ్చల్​ జిల్లా దుండిగల్​ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు.

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా
author img

By

Published : Nov 14, 2019, 4:31 PM IST

Updated : Nov 15, 2019, 9:38 AM IST

అక్షయ పాత్రలో ఇప్పుడు అల్పాహారం కూడా

మేడ్చల్​ జిల్లా దుండిగల్​ ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభమైంది. అక్షయ పాత్ర ఫౌండేషన్, గ్లాండ్​ ఫార్మా లిమిటెడ్​ భాగస్వామ్యంలో మొదలైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.

అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం కింద చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నామని అక్షయ పాత్ర ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర తెలిపారు. అల్పాహారాన్ని కూడా అందించాలనే సంకల్పంతో కొద్దిరోజుల క్రితం చెన్నైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని వెల్లడించారు.

అది విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగానే గ్లాండ్ ఫార్మా వారి సహకారంతో దుండిగల్​లో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు అల్పాహారం అందించాలనుకోవడం చాలా మంచి నిర్ణయమని మంత్రి మల్లారెడ్డి ప్రశంసించారు. అక్షయ పాత్ర, గ్లాండ్​ ఫార్మా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు.

Intro:TG_HYD_12_14_AKSHAYA PATRA_FOOD DISTRIBUTION_TIFFINS_AB_TS10011

మేడ్చల్ : దుందిగల్
దుందిగల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి.

Body:బాలల దినోత్సవం సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ మరియు గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ భాగస్వామ్యంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో అక్షయపాత్ర అల్పాహారం కార్యక్రమాన్ని మొట్టమొదటగా దుండిగల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించింది..
7,500 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రయోజనం చేకూరుతుందని దీనికి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ వారు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి
గ్లాండ్ ఫార్మా మరియు అక్షయ పాత్ర విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం పథకాన్ని ఆయన ప్రశంసించారు.. మున్ముందు మరికొందరు విద్యార్థులకు చేరువ చేయాలని వారికి సూచించారు..
అక్షపాత్ర ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌరచంద్రడదాస ప్రభుజి మాట్లాడుతూ..
అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం చాలయేళ్లుగా సేవాలందిస్తున్నామని అలాగే అల్పాహారాన్ని కూడా అందించాలనే సంకల్పంతో కొద్దిరోజుల క్రితం చెన్నైలో ప్రయోగాత్మకంగా ప్రారంబించామని అది విజయం కావడంతో దేశ వ్యాప్తంగా అమలు చేయనున్న క్రమంలో నేడు గ్లాండ్ ఫార్మా వారి సహకారంతో దుందిగల్ లో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు..
గ్లాండ్ ఫార్మా ఎండి మరియు సీఈవో శ్రీనివాస్ సాధు మాట్లాడుతూ..విద్యార్థులు మానసికంగా దృడంగా ఉండేందుకు అల్పాహారం పథకాన్ని అక్షపాత్ర వారి సౌజన్యం తో నాణ్యమైన ఫుడ్ ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ లో నేడు ప్రారంభిస్తున్నట్లు 7500 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నట్లు సాధు పేర్కొన్నారు. మరి కొంత మందికి పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు..

Conclusion:అక్షపాత్ర ప్రాంతీయ అధ్యక్షులు... శ్రీమాన్ సత్యగౌరచంద్రడదాస ప్రభుజి
గ్లాండ్ ఫార్మా ఎండి మరియు సీఈవో...శ్రీనివాస్ సాధు
Last Updated : Nov 15, 2019, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.