ETV Bharat / state

పోలీసులపై కత్తితో దాడికి యత్నం..

author img

By

Published : May 28, 2020, 2:50 PM IST

సికింద్రాబాద్​లో చిలకలగూడ వద్ద ఓ కిరాణా దుకాణంలో గొడవ జరగగా.. ఘటనలో రైల్వే ఉద్యోగి రాకేష్​పై దుండగుడు కత్తితో దాడి చేశారు. అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు దాడి సమయంలో మద్యంతో పాటు డ్రగ్స్ సేవించాడని.. పోలీసులు అనుమానిస్తున్నారు.

a railway employee was stabbed with knife at secunderabad
కిరాణా షాపులో గొడవ.. రైల్వే ఉద్యోగిపై కత్తితో దాడి

సికింద్రాబాద్​లోని చిలకలగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో బుధవారం రాత్రి మెట్టుగూడలో పీడీ యాక్ట్​ కింద కేసులున్న భాగ్యరాజ్​ అనే వ్యక్తి ఓ కిరాణాషాప్​ వద్ద హల్​చల్​ చేశాడు. ఘటనలో రైల్వే ఉద్యోగి రాకేష్​ అనే వ్యక్తిని కత్తితో పొడిచి దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న రాకేష్​ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

నార్త్​ జోన్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు.. 20 నిమిషాల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపైనా రౌడీషీటర్​ భాగ్యరాజ్​ దాడికి యత్నించాడు. దాడి సమయంలో నిందితుడు మద్యంతో పాటు డ్రగ్స్​ కూడా సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: పత్తికి అదనంగా రూ.275 పెంచండి!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.