ETV Bharat / state

రూ.300 లంచం తీసుకున్న కానిస్టేబుల్​ సస్పెండ్​

ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం తీసుకున్న కానిస్టేబుల్​ను సీపీ సజ్జనార్​ సస్పెండ్​ చేశారు. పేట్​ బషీర్​బాద్​ ఠాణాలో పెట్రో మొబైల్​-1 కానిస్టేబుల్​ రవీందర్​పై సీపీ వేటు వేశారు.

Constable suspended for bribe
రూ.300 లంచం తీసుకున్న కానిస్టేబుల్​ సస్పెండ్​
author img

By

Published : May 16, 2020, 11:37 PM IST

మేడ్చల్ జిల్లా పేట్​బషీర్​బాద్ ఠాణాలో పెట్రో మొబైల్​-1 కానిస్టేబుల్​ రవీందర్​పై వేటు పడింది. ఓ కేసు విషయంలో విచారణకు వెళ్లి బాధితుల నుంచి 500 రూపాయులు లంచం తీసుకున్న కారణంగా సైబర్​బాద్​ సీపీ... కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేశారు.

అసలు ఏమి జరిగిందంటే...

ఓ కేసు విషయంలో ఈనెల 14న మహారాష్ట్ర నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని విచారించడానికి వెళ్లిన కానిస్టేబుల్​ రవీందర్​ బాధితుడిని డబ్బులు డిమాండ్​ చేశాడు. 500 రూపాలయలు అడగగా... బాధితుడు 300 రూపాయలను రవీందర్​ బావమరిది శ్రీకాంత్​కు గూగుల్​పే ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని బాధితుడు ట్విట్టర్​ ద్వారా డీజీపీ, సీపీ సజ్జనార్​ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టి కానిస్టేబుల్​ రవీందర్​ను సీపీ సజ్జనార్​ సస్పెండ్​ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై మహేశ్​... బాధితుడి వద్దకు వెళ్లి అతడు నిరుపేద అవడం వల్ల నిత్యవసర సరకులు అందించి కొంత నగదు ఇచ్చారు.

ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.