మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఐదేళ్ల బాలుడిని కబళించింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న హరికృష్ణపై నుంచి ద్విచక్ర వాహనం దూసుకెళ్లి... తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.
15 రోజుల క్రితమే పట్నానికి...
హరికృష్ణ తల్లిదండ్రులు 15 రోజుల క్రితమే బతుకుదెరువు కోసం కర్నూలు నుంచి నగరానికి వచ్చారు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. తమ బిడ్డ ఇక లేడన్న నిజాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి : కార్వాన్ పేపర్ గోదాములో అగ్ని ప్రమాదం