1000 మందికి భోజనం ప్యాకెట్ల పంపిణీ - LOCK DOWN EFFECTS
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్లోని అయోధ్యానగర్, రంగారెడ్డి బండలో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో 1000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో అందరూ మానవతా దృక్పథంతో ఎవరికి తోచిన విధంగా వారు పేదలను ఆదుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని సంఘం సభ్యులు తెలిపారు.
1000 మందికి భోజనం ప్యాకెట్ల పంపిణీ
ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!